Site icon Prime9

Dhamki Movie Trailer: విశ్వక్‌ సేన్‌ `ధమ్కీ` ట్రైలర్‌

dhamki-trailer

Tollywood: ఓరి దేవుడా మూవీతో సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా ధమ్కీ. ఇందులో నివేతా పేతురాజ్ హీరోయిన్. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. నందమూరి బాలకృష్ణ అతిథిగా వచ్చి, ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు.ఏఎంబీ మల్టీఫ్లెక్స్ లో ఈ ట్రైలర్‌ ఈవెంట్ జరిగింది. ఇక విడుదలైన ధమ్కీ ట్రైలర్‌ దుమ్ము రేపేలా కనిపిస్తుంది.

ట్రైలర్‌ రావు రమేష్‌ వాయిస్‌ ఓవర్‌తో, ఆయన సీన్లతో ప్రారంభమవుతుంది. ఆరేళ్ల వయసున్న కంపెనీ, పదివేల కోట్ల టర్నోవర్‌. ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేట్‌లో పడిపోయాయి. సాయానికి ఒక్క గడ్డిపోచైనా దొరక్కపోతుందా? ఆదుకునేందుకు ఒక్క మనిషైనా దొరక్క పోతాడా? అని ఆయన అనగానే సర్‌  రెడీ సర్‌ అంటూ  విశ్వక్‌ సేన్‌ ఎంట్రీ ఇస్తాడు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో వెయిటర్‌గా కనిపిస్తాడు. ఎనర్జిటిక్‌ వెయిటర్‌గా విశ్వక్‌ తన జాబ్‌ ని రఫ్ఫాడిస్తుంటాడు.

ట్రైలర్‌ చూస్తుంటే తనలాగే ఉండే ఓ బిలియనీర్‌ కొడుకు స్థానంలో విశ్వక్‌ సేన్‌ వెళ్లి వాళ్ల కంపెనీ, ఫ్యామిలీని నిలబెట్టేందుకు ఏం చేశాడనే కథతో ఈ సినిమా సాగుతుందని అర్దమవుతోంది. ఫిబ్రవరిలో ఈచిత్రం విడుదల కాబోతుంది. ఈ మూవీకి లియోన్‌ జేమ్స్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇక ఈ మూవీని వన్మయి క్రియేషన్స్‌, విష్వక్సేన్ సినిమాస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Das Ka Dhamki - Trailer 1.0 | Vishwaksen | Nivetha Pethuraj | Karate Raju | Leon James

Exit mobile version
Skip to toolbar