Site icon Prime9

Vishwak Sen : RX100, మహా సముద్రం సినిమాలలో ఛాన్స్ మిస్ చేసుకున్న విశ్వక్ .. నెక్స్ట్ అజయ్ భూపతితో సినిమా ఫిక్స్

vishwak-sen-missed-ajay-bhupathi-directed-movies

vishwak-sen-missed-ajay-bhupathi-directed-movies

Vishwak Sen : విశ్వక్‌సేన్..షార్ట్ ఫిల్మ్ ల స్థాయి నుండి టాలీవుడ్ స్టార్ గా సొంతంగా ఎదిగిన నటుడు . షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి ‘వెళ్ళిపోమాకే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్ సినిమాలతో మంచి విజయాలు సాధించాడు.వాటి ద్వారా గొప్ప గుర్తింపు ని సాదించాడు . ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ యూత్ లో తనకంటూ ఓ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. విశ్వక్ సేన్ కి కథను ఎంచుకోవడం లో డిఫరెంట్ స్టైల్ ఉంది , దాని వల్లే అభిమానులలో క్రేజ్ త్వరగా సంపాదించుకోగలిగాడు . త్వరలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు విశ్వక్‌సేన్.

విశ్వక్‌సేన్ మంగళవారం సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్ లో మంగళవారం సినిమా మంచి విజయం సాధించినందుకు చిత్రయూనిట్ అందరికి అభినందనలు తెలిపాడు. అనంతరం విశ్వక్‌సేన్ మాట్లాడుతూ డైరెక్టర్ అజయ్ భూపతి గురించి, సినిమాల గురించి, తన సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. అజయ్ అన్న నాకు ఎప్పట్నుంచో తెలుసు. RX 100 సినిమా అప్పుడు నన్ను ఫోటోలు పంపించమన్నాడు. అప్పుడే నేను ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో సెలెక్ట్ అయ్యాను. దీంతో ఫోటోలు పంపలేదు. అలాగే తన రెండో సినిమా ‘మహా సముద్రం’ కథ కూడా నాకు వినిపించాడు. అప్పుడు కూడా డేట్లు అడ్జస్ట్ అవ్వక ఆ సినిమా చేయలేదు అని తెలిపాడు. దీంతో విశ్వక్ RX100, మహా సముద్రం సినిమాలు విశ్వక్ మిస్ అయినట్టు తెలుస్తుంది.

ఇక తన సినిమాల గురించి మాట్లాడుతూ.. ఫ్యూచర్ లో అజయ్ భూపతితో సినిమా ఉంటుంది అని ప్రకటించాడు. అలాగే ఫలక్ నామాదాస్ 2 కూడా ఉందని ప్రకటించాడు. ఇక చిన్నప్పటి నుంచి తనకి లుంగీ కట్టుకొని కత్తి పట్టుకొని మాస్ క్యారెక్టర్ చేయాలని ఉండేదని, అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో తీరిపోయింది. అలాంటి మాస్ క్యారెక్టర్ లోనే అజయ్ అన్న దర్శకత్వంలో కనిపిస్తాను అని తెలిపాడు విశ్వక్.

 

Exit mobile version