Site icon Prime9

Laila Teaser: లేడీ గెటప్‌తో నవ్విస్తున్న విశ్వక్‌ సేన్‌ – లైలా టీజర్‌ చూశారా?

Laila Movie Offical Teaser: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది మూవీ టీం. విశ్వక్‌ సేన్‌ ఈ మధ్య బ్యాక్‌ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్‌, ప్లాప్‌తో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అభిమానుల అలరించిన విశ్వక్‌ ఈ ఏడాది డిఫరెంట్‌ జానర్‌తో వస్తున్నాడు.

‘లైలా’ అంటూ లేడీ గెటప్‌తో అలరించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు మాస్‌ అవతార్‌లో మెప్పించిన విశ్వక్‌.. లేడీ పాత్రతో ఎలా మెప్పిస్తాడా? ఫ్యాన్స్‌ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో అతడి పాత్ర ఎలా ఉండనుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్‌ చేసిన టీజర్‌లో విశ్వక్‌ లేడీ గెటప్‌ని పరిచయం చేశారు.  మొదటి నుంచి ఎండ్‌ వరకు కామెడీతో సాగిన ఈ టీజర్‌ మూవీపై మంచి బజ్ క్రియేట్‌ చేస్తుంది.  ముఖ్యంగా చివరిలో చూపించిన విశ్వక్‌ లేడీ గెటప్‌ హెలెరియస్‌గా అనిపించింది. చూస్తుంటే ఈ రోల్‌ థియేటర్‌లో అదిరిపోయే ఫన్‌ అందించనుందని అర్థమైపోతుంది.

Laila (Official Teaser) | Vishwaksen | Akanksha Sharma | Ram Narayan | Leon James | Feb 14th

ఇందులో విశ్వక్‌ సోను పాత్రలో కనిపంచబోతున్నాడు. ఆడవాళ్ల ప్రత్యేకంగా బ్యూటీ సెలూన్‌, జిమ్‌ నిర్వహించే సోనుకు చూట్టుపక్కల ఆడవాళ్లంతా ఫ్యాన్స్‌ అయిపోతారు. కేవలం యువతులు మాత్రమే కాదు పెళ్లయిన ఆడవాళ్లు కూడా సోను సోను అంటూ అతడి పేరునే కలవరిస్తుంటారు. దీంతో వారి భర్తలు పడే బాధలు ఏంటో టీజర్‌లో చూపించి నవ్వించారు. చూస్తుంటే ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగనుందని తెలుస్తోంది. రొమాంటిక్‌ అండ్‌ ఫన్‌గా సాగిన ఈ టీజర్‌ మూవీపై మరింత బజ్‌ పెంచుతుంది. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version
Skip to toolbar