Site icon Prime9

Vijay Sethupathi : స్టార్ హీరో కొడుకు హీరో ఎంట్రీ.. ఆ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ ..

vijay-sethupathi-son-surya-sethupathi-doing-a-movie-as-hero

vijay-sethupathi-son-surya-sethupathi-doing-a-movie-as-hero

Vijay Sethupathi : విజయ్ సేతుపతి సపోర్టింగ్ యాక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు . స్వతహాగా ఎదిగి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ కొడుకు సూర్య సేతుపతి త్వరలో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికే నటనలో ఓనమాలు దిద్దిన సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళం, హిందీ, తెలుగు, మళయాళ భాషలలో అద్భుతమైన సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు విజయ్ సేతుపతి. ఆయనకు ఇద్దరు పిల్లలు సూర్య, శ్రీజ. ఇద్దరు కూడా తండ్రి నటనను పుణికి పుచ్చుకున్నారు. ఇప్పటికే సూర్య ‘నానుమ్ రౌడీ’, ‘ముగిజ్’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. అతి చిన్న వయసులోనే సూర్య సేతుపతి కూడా తండ్రి బాటలో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో పూర్తి స్ధాయి శిక్షణ తీసుకున్న సూర్య హీరోగా చేయబోతున్న మొదటి సినిమాకి రంగం సిద్ధమైంది.

సూర్య సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకు ‘ఫీనిక్స్’ అని పేరు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాని సీనియర్ స్టంట్ మాస్టర్ అరసు డైరెక్ట్ చేస్తున్నారు. అరసు ఇండియన్ 2, జవాన్ సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమాకి సీఎస్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు. ఏకే బ్రేవ్‌మన్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విజయ్ సేతుపతి యాక్టింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు , మరి సూర్య సేతుపతి తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటాడో లేదో చూడాలి . ఈ విషయం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

Exit mobile version