Site icon Prime9

#VD12 – ‘Kingdom’ Teaser: ఇది కదా విజయ్‌ ఫ్యాన్స్‌కి కావాల్సింది – టీజర్‌తో పాటు టైటిల్‌ కూడా.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న VD12 టీజర్‌..!

Vijay Devarakonda’s VD12 Teaser Out Now: హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘వీడీ12′(VD12) సినిమాతో బిజీగా ఉన్నాడు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా గౌతమ్‌ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘కింగ్‌డమ్‌’ అనే టైటిల్‌ ఖారారు చేసింది మూవీ టీం. నేడు టీజర్‌ లాంచ్‌ చేస్తున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. టీజర్‌తో పాటు టైటిల్‌ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం మరో విశేషం. టీజర్‌ మొత్తం మాస్‌ అండ్‌ యాక్షన్‌తో సాగింది. రా అండ్‌ రస్టిక్‌ లుక్‌లో విజయ్‌ దేవరకొండ ఆకట్టుకున్నాడు.

ఇక టీజర్‌ దాదాపు ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో సాగింది. “అలసట లేని భీకర యుద్దం… అలలుగా పారే ఏరుల రక్తం.. వలసపోయినా, అలిసిపోయిన ఆగిపోనిది ఈ మహా రణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత భీభత్సం ఎవరి కోసం? అసలీ వినాశనం ఎవరి కోసం? రణభూఇని చీల్చుకుని పూట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలుకొట్టి పునర్జన్మ ఎత్తిన నాయకుడి కోసం” అంటూ ఎన్టీఆర్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించింది.

కాగా మళ్లీ రావా, జెర్సీ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారుతిన్ననూరి. ఆయన దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ సినిమా అనగానే ఆడియన్స్‌ అంచనాలు నెలకొన్నాయి. లైగర్‌, ఫ్యామిలీ స్టార్‌ వరుస ప్లాప్స్‌తో విజయ్‌ కెరీర్‌ డౌన్‌ అయ్యింది. దీంతో ఈసారి ఎలాగైన భారీ హిట్‌ కొట్టి గట్టి కంబ్యాక్‌ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు విజయ్‌. అలాగే అతడి ఫ్యాన్స్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో గౌతమ్‌ తిన్ననూరితో చిత్రం అనగానే అభిమానుల్లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. ఇప్పుడు ఈ టీజర్‌ అంచనాలను మరింత రెట్టింపు చేసింది.

KINGDOM - Official Teaser | Vijay Deverakonda | Anirudh Ravichander | SNaga Vamsi | Gowtam Tinnanuri

 

ఇందులో విజయ్‌ రా అండ్‌ రస్టిక్‌ లుక్‌, మాస్‌ యాక్షన్‌తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో విజయ్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఇక టీజర్‌లో విజయ్‌ చేసిన సాహసాలు, పోరాటాలను హైలైట్‌ చేశారు. అనిరుధ్‌ రవిచందర్‌ నేపథ్య సంగీతం విజయ్‌ మాస్ ఎలివేషన్‌ మరింత హైలెట్‌ చేస్తోంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించిందనే చెప్పాలి. మొత్తానికి కింగ్‌డమ్‌ టీజర్‌ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూర్య వాయిస్ ఓవర్‌తో తమిళ్, రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్‌తో హిందీ టీజర్స్ విడుదల అయ్యాయి.

Exit mobile version
Skip to toolbar