Site icon Prime9

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. లాంఛనంగా #VD12 పూజా కార్యక్రమం

vijay devarakonda new movie pooja ceremony photos goes viral

vijay devarakonda new movie pooja ceremony photos goes viral

Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమా గొప్ప హిట్ అవుతుందని భావించినప్పటికి ఇది డిజాస్టర్ గా నిలిచింది. చాలామంది ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే బాలీవుడ్ బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించారు. కానీ అనుకోని రీతిలో ఈ మూవీ డిజాస్టర్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది.

అయితే విజయ్ లైగర్ సినిమా భారీ పరాజయం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ప్రస్తుతం మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే సమంతతో ఖుషి సినిమా షూట్ చేస్తున్నాడు. ఇటీవల కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. కాగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచారు మూవీ టీమ్.

ఈ మేరకు నేడు ఉదయం రామానాయుడు స్టూడియోలో #VD12 పూజా కార్యక్రమం జరిగింది. ఇక ఈ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. పూజా కార్యక్రమానికి శ్రీలీల కూడా రావడంతో ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని ఖరారు అయ్యింది. దీంతో శ్రీలీల ఖాతాలో మరో సినిమా చేరింది. ఇక దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అలానే మరోవైపు విజయ్ దేవరకొండ మరోసారి దర్శకుడు పరశురామ్ తో చేతులు కలపబోతున్నాడు. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ దిల్ రాజు, విజయ్, పరశురామ్ తో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తాము ఎదురు చూస్తూ ఉండండి అంటూ ట్వీట్ చేశాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. పరశురామ్ – విజయ్ కాంబినేషన్ మళ్ళీ హిట్ కొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.  2018లో కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలింలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

Exit mobile version