Site icon Prime9

Vijay Devarakonda: ‘జనగణమన’ గురించి మర్చిపోండి.. రౌడీ బాయ్​ ఆసక్తికర వ్యాఖ్యలు..​!

vijay devarakonda comments on janaganamana movie

vijay devarakonda comments on janaganamana movie

Vijay Devarakonda: లైగర్‌ సినిమా విడుదలకు ముందే విజయ్‌ దేవరకొండతో తన కలల ప్రాజెక్టు ‘జనగణమన’ ప్రారంభించనున్నట్టు పూరీ జగన్నాథ్‌ ప్రకటించారు.  కాగా లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికలపడడంతో.. “జనగణమన” చిత్రంపై ఇప్పుడు ఎవరూ చడీచప్పుడు చెయ్యడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సైమా అవార్డ్స్ వేదికగా విజయ్ ఈ చిత్రం గురించి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

బాక్సాఫీస్‌ వద్ద లైగర్ మూవీ నిరాశ మిగల్చడం వల్ల… విజయ్ తదుపరి ప్రాజెక్టు అయిన జనగణమనపై దర్శక, నిర్మాతలు ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. జనగణమన ఆగిపోయిందంటూ వస్తున్న రూమర్స్ పై ఆ చిత్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్న పూరీ జగన్నాథ్‌, ఛార్మీలు సైతం ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు.

ఈ నేపథ్యంలో హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా సైమా వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్సవాలకు హాజరైన విజయ్ ని అక్కడి మీడియా మిత్రులు జనగణమన చిత్రం అప్డేట్స్ గురించి అడుగగా… ఇక్కడికి ప్రతీ ఒక్కరు సైమా వేడుకను చూసి ఎంజాయ్‌ చేయడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ దాని గురించి మర్చిపోండి.. సైమాను ఎంజాయ్‌ చేయండి’ అంటూ బదులిచ్చాడు. ఈ విధంగా విజయ్‌ చేసి వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ… విజయ్‌ దేవరకొండ ఎప్పటిలా సైమాలో సందడి చేయడాన్ని హర్షిస్తుంటే, మరికొందరు ఇక జనగణమన ఆగిపోయినట్లేనా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

దాదాపు ఆరేళ్ల క్రితమే పూరీ జగన్నాథ్‌ ఈ క్రేజీ ప్రాజెక్టు పేరు తెరపైకి తీసుకొచ్చారు. కాగా ఈ ఏడాది మార్చిలో విజయ్‌ దేవరకొండ, పూజా హెగ్దే హీరోహీరోయిన్లుగా ఈ చిత్రం షెడ్యూల్‌ను ప్రారంభించారు. అయితే లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ తో మరి జనగణమన ముందుకు కదులుతుందో లేదో అనే ఉత్కంఠ ప్రేక్షకాభిమానుల్లో నెలకొంది.

ఇదీ చదవండి: Oke Oka Jeevitham: ఆడియన్స్ మెచ్చిన ఒకే ఒక జీవితం.. అమ్మ పాట విడుదల

Exit mobile version