Vidudhala Part1: విజయ్‌సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం విడుదలై పార్ట్ 1. తెలుగులో ఈ సినిమా విడుదల పార్ట్ 1 పేరుతో ముందుకు వస్తుంది. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఇది వరకే తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా ఎప్రిల్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మనిషి పుట్టగానే ఒకరు పైన.. ఒకరు కింద.. మరొకరు ఇంకా కింద.. అని వేరు చేసే మీరు వేర్పాటు వాదులా? లేదు అందరూ సమానమే అని పోరాడే మేము వేర్పాటు వాదులమా?’ అని ప్రశ్నించిన తీరు ఇందులో కనిపిస్తుంది.
తమిళంలో వెట్రిమారన్ టేకింగ్, సూరి, విజయ్ సేతుపతిల నటనకు ప్రేక్షకులు నిరాజనం పట్టారు.
గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.