Venkatesh With Balakrishna in Unstoppable Show: నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో విక్టరి వెంకటేష్ సందడి చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రొమో విడుదలైంది. బాలయ్య, వెంకటేష్‌ల సరదా ముచ్చట్లు, జోష్, ఎనర్జీ షోని నెక్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’, బాలయ్య ‘డాకు మహారాజ్’ రిలీజ్ కానున్నాయి. ఈ సందర్భంగా షోలో తమ చిత్రాల గురించి ఫన్నీగా మాట్లాడుకున్నారు.
బాలయ్య చిలిపి క్వశ్చ్యన్స్‌కి వెంకటేష్ సరదా సమాధానాలు ఆకట్టుకున్నాయి. డాకు మహారాజ్ అంటూ హైప్ ఇవ్వగా.. బాలయ్య వెంటనే నా మనసులో నువ్వే మహారాజ్ అని డైలాంగ్ వేశారు. ఆ తర్వాత ఇద్దరు గతాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల వింటేజ్ ఫోటో చూపిస్తూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. మన నలుగురిలో రాముడు మంచి బాలుడు అంటూ బాలయ్య సిగ్గుపడిపోతుంటేని బాలయ్య అంటుండగా.. వెంటనే వెంకి అందుకుని హలో హలో.. కొంపదిసి నువ్వు రాముడు అనుకుంటున్నావా? అని అనగా.. అలా బయపెట్టేస్తే ఎలా అండి అంటూ సరదాగా సటైర్లు వేసుకున్నారు.
ఆ తర్వాత ఈ షోలో రానా, నాగ చైతన్యతో ఉన్న బాండింగ్ షేర్ చేసుకున్నారు వెంకి. ఆ తర్వాత షోలో వెంకటేష్ అన్నయ్య, సురేష్ ప్రొడక్షన్ అధినే సురేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకి గురించిన పలు ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. స్కూల్ బెస్ట్ యావరేజ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పుకొచ్చారు. అనంతరం ఇద్దరు తమ తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక మధ్యలో డైరెక్టర్ అనిల్ రావి పూడి రాకతో షో మరింత జోష్‌గా మారింది. వెంకి, బాలయ్య కలిపి ఆయన ఇంటర్య్వూ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రొమో ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.