Site icon Prime9

Rana Naidu Web Series: “రానా నాయుడు” టీజర్ అదుర్స్… ఒకే ఫ్రేమ్ లో బాబాయ్ అబ్బాయ్

rananaidu web series

rananaidu web series

Rana Naidu Web Series: దగ్గుబాటి స్టార్ హీరోలైన విక్టరీ వెంకటేష్‌, రానా కలిసి నటిస్తున్న వెబ్‌సిరీస్‌ “రానా నాయుడు”. దీనికి క‌ర‌న్ హ‌న్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అమెరిక‌న్ క్రైమ్ డ్రామా సిరీస్ అయిన ‘రే డోనోవ‌న్’ ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కింది. బాబాయి, అబ్బాయిలు క‌లిసి ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించ‌నుండటంతో ఎప్పుడెప్పుడు ఈ సిరీజ్ విడుదలవుతుందా అని ప్రేక్ష‌కుల‌లో చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారనే చెప్పుకోవాలి. ఇక ఇప్పటికే విడుదలైన రానా, వెంకటేష్‌ పోస్టర్‌లు వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు పెంచేశాయి. కాగా ఇటీవల షూటింగా పూర్తిచేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ టీజర్‌ను మేకర్స్‌ తాజాగా విడుదల చేశారు.

సాయం కావాలా? అంటూ రానా డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకుంది. సెలబ్రెటీలకు ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే.. రానా దాన్ని సాల్వ్‌ చేసే వ్యక్తిగా టీజర్‌లో కనిపించాడు. కాగా నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక వయసు మళ్ళిన పాత్రలో వెంకటేష్‌ లుక్స్ అయితే కిరాక్ అని చెప్పువచ్చు. ఇక చివర్లో వెంకటేష్‌పై రానా గన్‌ పెట్టే సీన్‌ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. టీజర్‌తోనే మేకర్స్‌ వెబ్‌సిరీస్‌పై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ను తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

Rana Naidu | Official Teaser | Rana Daggubati, Daggubati Venkatesh, Surveen Chawla | Netflix India

ఇదీ చదవండి: Cobra Movie On OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కోబ్రా.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!

 

Exit mobile version
Skip to toolbar