Site icon Prime9

Vaishnav Tej : ఈసారి పక్కా మాస్ అవతార్ లో వైష్ణవ్ తేజ్.. ‘ఆదికేశవ’ గా మెగా హీరో !

vaishnav tej new movie titled as adikesava and glimpse got viral

vaishnav tej new movie titled as adikesava and glimpse got viral

Vaishnav Tej : పంజా వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి, ఏ డెబ్యూ హీరోకీ సాధ్యం కాని రేర్ ఫీట్ అండ్ రికార్డ్ నెలకొల్పాడు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కొండపొలం’ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇటీవలే రంగా రంగా వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. హాట్ బ్యూటీ కేతిక శర్మ తో కలిసి నటించిన ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కాగా వైష్ణవ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం #PVT 04. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు రెండు పోస్టర్ లు రిలీజ్ చేసిన మూవీ టీం తాజాగా.. టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.

PVT 04 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి తాజాగా “ఆదికేశవ” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలానే ఫ్యాన్స్ కి డబుల్ బోనజా ఇస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో వైష్ణవ్ తేజ్ పక్కా మాస్ అవతారంలో కనిపించి అదరగొట్టేశాడు. మైనింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతుందని గ్లింప్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఆ మైనింగ్ చేస్తూ శివుడి గుడిని కూడా విలన్స్ కూల్చడానికి ప్రయత్నిస్తుంటే హీరో వాళ్ళని అడ్డుకోవడమే సినిమా కథగా భావిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ విలన్ గా కనిపించబోతున్నాడు.

తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాని సంయుక్త నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. పలు కారణాల రీత్యా ఆలస్యం అవుతూ వస్తుంది. కొత్త విడుదల తేదీన త్వరలోనే అనౌన్స్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.

Exit mobile version