Attack on Tollywood Director: టాలీవుడ్ డైరెక్టర్‌పై దాడి జరిగింది. మూవీ ప్రమోషన్స్‌లో మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ముకుమ్ముడిగా దాడి చేశారు. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘డ్రింకర్ సాయి’. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ సినిమానున నిర్మించారు. ఓ డ్రింకర్ ప్రేమకథ ఆధారం తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందకు వచ్చింది.
మూవీ మంచి టాక్ తెచ్చుకుని విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సక్సెస్ టూర్ నిర్వహించిన మూవీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు శివ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతుండగా ఆకస్మాత్తుగా కొందరు వచ్చి దాడికి తెగబడ్డారు. అయితే వారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. మంతెన సత్యనారాయణ అభిమానలు అని తెలుస్తోంది. సినిమాలో ఆయనను కించపరిచే విధంగా డైలాగ్స్ ఉన్నాయని, వాటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా డైరెక్టర్ విచక్షణ రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#DrinkerSai దర్శకుడు మీద దాడి చేసిన మంతెన సత్యనారాయణ అభిమానులు.. pic.twitter.com/xQ7JL6IQbZ
— Suresh PRO (@SureshPRO_) December 29, 2024