Site icon Prime9

Trisha: త్రిష పై వస్తున్న వార్తలను ఖండించిన త్రిష తల్లి ఉమా కృష్ణన్

Trisha news prime9news

Trisha news prime9news

Trisha Mother : త‌మిళ హీరోయిన్ త్రిష తెలుగులో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె త్వ‌ర‌లోనే మన అందరికి ఒక షాక్ న్యూస్ చెప్పనుందని ఓ వార్త తెగ చక్కర కొడుతోంది. త్రిష రాజ‌కీయాల్లోకి వస్తుందంటూ సోష‌ల్ మీడియాలో వార్తలు తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త్రిష ఓ జాతీయ పార్టీలో చేరుతుందని కథనాలు వినిపిస్తున్నాయి. అందులో ఓ స్టార్ హీరో సపోర్ట్ కూడా ఉందని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తున్నాయి.

త‌మిళ‌నాట సినీ స్టార్స్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌టం అనేది చాలా సాధార‌ణ విష‌యం. సినీ స్టార్స్ కున్న అభిమానులు చూసి ఏదో ఒక రాజ‌కీయ పార్టీలో జాయిన్ కావ‌ట‌మో లేక స్వంత పార్టీ పెట్టుకోవ‌ట‌మో సినీ స్టార్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ జాబితాలో త్రిష కూడా చేరింది. త్రిష కాంగ్రెస్ పార్టీలో చేరుతుందంటూ టాక్ వ‌చ్చింది. ప్ర‌ముఖ హీరో విజ‌య్ ఆమెకు స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని కూడా కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్త‌లపై త్రిష త‌ల్లి ఉమా కృష్ణన్ ఖండించారు. ఈ వార్తలు విన్న తరువాత చాలా సీరియ‌స్ అయ్యారు. ప్ర‌స్తుతం త్రిష వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు ఎక్క‌డి నుంచి పుట్టుకొస్తాయో మాకు తెలియ‌టం లేదని మండి పడ్డారు. తన‌కు రాజ‌కీయాల్లో చేరాల‌నే ఆలోచ‌న‌లో లేదు. మ‌రిన్ని సినిమాల్లో న‌టించ‌డానికి అగ్రిమెంట్స్‌పై సంతకం పెట్ట‌నుందని అన్నారు.

త్రిష ప్రస్తుతం మణి రత్నం దర్శకత్వంలో నటింస్తుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ సినిమాలో త్రిష ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 30న గ్రాందుగా రిలీజ్ అవ్వనుంది దీంతో పాటు గ‌ర్జ‌న‌, రోడ్‌, రంగి, చ‌దురంగ వేట్టై 2 సినిమాలు రిలీజ్‌ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.

Exit mobile version