Site icon Prime9

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిషకు గాయం

trisha leg injured

trisha leg injured

Trisha: దక్షిణాది ముద్దుగుమ్మ, ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష గాయపడ్డారు. పొన్నియన్ సెల్వన్ సక్సెస్ అయిన సందర్భంగా ఇటీవల సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు త్రిష. అయితే ఇటీవల విదేశాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆమె జారిపడటం వల్ల కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కాలుకు కట్టు కట్టిన ఫొటోను ఆమె ఇన్స్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దీనితో వెకేషన్ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలిపారు. ఇక ఈ వార్త విన్న అభిమానులు త్రిష త్వరగా కోలుకోవాలంటూ కోరుతూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం పొన్నయన్ సెల్వన్-1 సినిమా హిట్ కావడంతో ఆమె వెకేషన్ ట్రిప్ కు వెళ్లారు.

ఇదీ చదవండి: ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా.. ఆనందంలో కపూర్ కుటుంబం

Exit mobile version