Site icon Prime9

Yatra-2: యాత్ర 2 టీజర్ లీక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్

Yatra-2: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోగ్రఫీ ఆధారంగా మరియు ఆయన చేసిన పాదయాత్ర ఆధారంగా టాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మలయాళ హీరో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో 2019 ఎన్నికల సమయంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. మహీ వి రాఘవ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీకి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు, అది కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ కథ నేపథ్యంలో ఈ మూవీ రాబోతుందని తెలిసి ప్రతి ఒకరిలో ఆసక్తి మొదలైంది.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూలై 8న దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా మూవీని అధికారికంగా అనౌన్స్ చేసి మూవీ వివరాలను తెలియజేయడానికి మూవీ యూనిట్ రంగం సిద్ధం చేసింది. అయితే ఇంతలోనే ఆ అనౌన్స్ మెంట్ పోస్టర్ అండ్ టీజర్ నెట్టింట లీక్ అయ్యి మేకర్స్ కి షాక్ ఇచ్చింది. ఆ అనౌన్స్ మెంట్ టీజర్ లో.. యానిమేటెడ్ జగన్ నడుస్తూ ఉంటే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ వస్తుంటుంది. “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అంటూ జగన్ వాయిస్ ఓవర్ తో టీజర్ రన్ అయ్యింది.

ఇక ఈ టీజర్ చూసిన ఆడియన్స్ అదిరిపోయింది అంటున్నారు. కాగా ఈ సినిమాని V సెల్యులాయిడ్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ప్రాజెక్ట్ Kకి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ వైఎస్ జగన్ పాదయాత్ర దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయ్యి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పూర్తి అవుతుందని గతంలోనే దర్శకుడు తెలియజేశాడు. ఈ సినిమాలో జగన్ పాత్రని తమిళ్ హీరో జీవా చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ మూవీ టీం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు.

 

Exit mobile version