Site icon Prime9

Umair sandhu: ఉమైర్ సంధు ట్వీట్ల పై మండిపడుతున్న నెటిజన్లు

review prime9news

review prime9news

Tollywood: ఉమైర్ సంధు పేరు వినగానే సినిమా రివ్యూస్ గుర్తొస్తాయి. తనని తాను దుబాయ్ సెన్సార్ సభ్యుడంటూ అందరికీ చెప్పుకుంటాడు. ఏ కొత్త సినిమాలు వచ్చినా విడుదల కాక ముందే తనకు ఇష్టం వచ్చినట్టుగా రివ్యూలు ఇస్తుంటాడు. అలాంటి ఉమైర్ సంధుకి మొదట్లో మీడియా బాగానే సపోర్ట్ చేసింది. కానీ, ఎప్పుడైతే ఉమైర్ సంధు ఫేక్ అని తేలిందో అప్పటి నుంచి అతను ఇస్తున్న రివ్యూలు ఎప్పుడైతే బెడిసి కొట్టాయి. ఇక అప్పటి నుంచి సార్ గారి ఇమేజ్ మొత్తం నెగెటివ్ గా మారింది.

RRR సినిమా సమయంలో ఉమైర్ సంధు హడావిడి మామూలుగా లేదు. రాధే శ్యామ్ అప్పుడు కూడా ఒక రేంజులో ట్వీట్ చేశాడు కానీ ఆ సినిమా ప్రభాస్ కెరీయర్లో పెద్ద డిజాస్టర్ అయింది. అలా ఉమైర్ సంధు దేని మీద ట్వీట్ చేసినా బాగుందని చెప్పినా సినిమాలన్ని బెడిసి కొట్టాయి. అలాగే ఆ సినిమాలు దారుణంగా బోల్తా పడ్డాయి. ఐతే గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం కాస్త భిన్నంగా ట్వీట్ చేశాడు అది ఏంటంటే సినిమా కథ బాలేదని ఇక చిరంజీవి విశ్రాంతి తీసుకుంటే మంచిదని అన్నాడు. ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేశారు.

తాజాగా మరో ట్వీటుతో ఉమైర్ సంధు వార్తల్లో నిలిచాడు. బ్రహ్మస్త్ర, PS 1 అనే రెండు సినిమాలు ఈ ఏడాది ఫేక్ కలెక్షన్లు, ఫేక్ బ్లాక్ బాస్టర్స్ కు పర్ఫెక్ట్ ఉదాహరణలు అంటూ ఉమైర్ సంధు కొత్త ట్వీట్ చేశాడు.ఇది చూసిన నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

 

ఇదీ చదవండి: జూనియర్ ఆర్టిస్ట్ పై రేప్.. ఆ హీరో అరెస్ట్

Exit mobile version