Site icon Prime9

Apsara Rani: ప్రసాద్ ల్యాబ్ లో “తలకోన” చిత్ర షూటింగ్ ప్రారంభం

talakona-movie-launch

talakona-movie-launch

Tollywood: రాజకీయాలు, ప్రకృతి అందాలతోపాటు అటవీ నేపధ్యంలో సాగే క్రైమ్ ధిల్లర్ సినిమా ‘తలకోన’ చిత్ర షూటింగ్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభించారు. మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాతలుగా విశ్వేశ్వర శర్మ, డి. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న తలకోస సినిమా షూటింగ్ ను ప్రముఖ నిర్మాత రామారావు కెమరా స్విచ్ ఆన్ చేసి క్లిక్ మనిపించారు. నగేష్ నారదాసి దర్శకత్వంలో చేపట్టిన సినిమా తొలి ముహర్తపు షాట్ కి ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ కొట్టారు.

 

ఈ సంద్భంగా దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ పలు చిత్ర దర్శకునిగా పనిచేసిన అనుభవంతో ‘తలకోన’ చిత్రంతో మరోసారి మీ ముందుకు వస్తునాన్నారు. క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ చిత్ర కథాంశం పూర్తి అటవీ నేపథ్యంలో సాగుతుందన్నారు. ప్రకృతి అందాల్లో మరో కోణాన్ని సినిమాలో చూపించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీడియా పాత్ర కూడా సినిమాలో ఉంటుందన్నారు. ప్రకృతి ఒడిలో చోటుచేసుకొనే అనేక విషయాలను తెలిపే ప్రయత్నాన్ని చేస్తున్నట్లు చెప్పారు. కధాంశంలో వస్తే, అడవిలోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు ఎంతమంది తిరిగొచ్చారు అనే దానిపై సినిమా నడుస్తుందన్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ గా కూడ సినిమా ఉండపోతుందని, ఇందులో కధానాయకిగా అప్సర రాణి నటిస్తుందన్నారు. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో సినిమాను తెరపైకి ఎక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. తలకోన చిత్రాన్ని 20రోజులు హైదరాబాద్ లో మరో 20 రోజులు తలకొనలో రెగ్యులర్ షూటింగ్ చేసుకోనున్నట్లు దర్శకుడు తెలిపారు.

నిర్మాతల్లో ఒకరైన డి.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తొలిసారిగా సిని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానన్నారు. కధాంశం బాగుండడంతో సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ, మంచి స్క్రిప్ట్స్ కు నేను ఎప్పటికీ ఫ్యాన్ నన్నారు. నేను ఎంచుకొన్న కధలతోనే నాకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ గా సుభాష్ సంగీతాన్ని అందించనున్నారు. పరిటాల వీర గౌతమ్ రాంబాబు నిర్వహణలో ఫైట్ మాస్టర్ గా విన్ చిన్ అంజి ప్రేక్షకులకు మంచి కిక్ ను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా, ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్, తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Shade Studios: భాగ్యనగరంలో షేడ్ స్టూడియోస్.. కలర్ ఫుల్ గా

Exit mobile version