Site icon Prime9

Swathimuthyam Trailer: స్వాతిముత్యం ట్రైలర్ రిలీజ్.. ఫ్యామిలీ ఎంటరైనర్ గా మూవీ

swathimuthyam movie trailer

swathimuthyam movie trailer

Swathimuthyam Trailer: బెల్లంకొండ గణేశ్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. సితార బ్యానర్ తో కలిసి త్రివిక్రమ్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. గణేశ్కు జోడీగా వర్ష బొల్లమ్మ నటించింది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. లక్ష్మణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఈ ట్రైలర్ చూస్తే లవ్, కామెడీ, ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడం, పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలవరకూ వెళ్లే ప్రయాణంలోని ఎమోషన్స్ తో ఈ కథ సాగుతుందనే విషయం ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. రావు రమేశ్, నరేశ్, వెన్నెల కిశోర్, ప్రగతి, గోపరాజు రమణ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు.


ఇదీ చదవండి:  జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రీరిలీజ్ రేసులో “ఆది”

Exit mobile version