Virupaksha Trailer: మెగా మేనల్లుడు, యంగ్ డైనమిక్ స్టార్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కి గురై చాలా రోజులు హాస్పిటల్, ఇంట్లోనే ఉండి పూర్తిగా రికవర్ అయ్యాక ఇప్పుడు విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్నాడు తేజ్. మిస్టికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేని అందిస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ లు, టీజర్ అండ్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒక కొత్త కథని చూడబోతున్నాము అనే ఫీలింగ్ ని కలగజేశాయి. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా ముందుగానే ఈ ట్రైలర్ గురించి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ”మీ అంచనాలకు మించి ఉంటుంది. ట్రైలర్ చూసి సర్‌ప్రైజ్ ఫీల్ అవుతారు” అంటూ ఆయన కామెంట్ చేశాడు. దీనితో ఆడియన్స్ లో ఈ ట్రైలర్ పై మరింత ఆసక్తి పెరిగింది. మరి తాజాగా ప్రేక్షకులను మరింత థ్రిల్ కి గురి చేసేందుకు గానూ ఈ సినిమా నుంచి ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్.
సస్పెన్స్ థ్రిల్లర్(Virupaksha Trailer)
ఈ ట్రైలర్ చూస్తుంటే మూఢనమ్మాకాలు, మాయలు, వరుస హత్యలో కూడుకున్న ఓ ఊరిలో అనుకోకుండా హీరో చిక్కుకుపోయినట్టు కనిపింది. అక్కడే హీరోయిన్తో ప్రేమలో పడడం, ఆ హీరోయిన్ ఓ మాంత్రికుడి వశీకరణలోకి వెళ్లినట్టు వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇక ఆ ఊర్లో జరిగే వరుస హత్యలను ఎలాగైనా ఆపుతానని హీరో అంటాడు. దానికి ఆత్మాహుతి హత్యలను ఆపడానికి ఆ దైవం ఎంచుకున్న విరూపక్షే హీరో అని ఓ యోగి చెప్పడంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది. ఇలా ఈ ట్రైలర్ ఆధ్యంతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజంగానే ఓ కొత్త కథను చూడబోతున్నాం అనే ఫీల్ ను కలిగించిందని ప్రేక్షకులు అంటున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 21న థియేటర్లలోకి రానుంది. ఇటీవలే మూవీ ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున మొదలుపెట్టారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మళయాల ముద్దుగుమ్మ, సార్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీతో సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మరి ఈ ఈవెంట్ కి ఎవరు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.