Site icon Prime9

Sudheer Babu: “హరోం హర” అంటూ పలకరించనున్న సుధీర్ బాబు

sudheer babu latest movie harom hara title video out

sudheer babu latest movie harom hara title video out

Sudheer Babu: సూపర్ స్టార్ కుటుంబం నుంచి వచ్చినా.. ఆ పేరును ఏమాత్రం తగ్గించకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధీర్‌బాబు. ఇటీవల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరో తాజాగా మరో ఆసక్తికర కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన పనులు ఈరోజు లాంఛనంగా  ప్రారంభమయ్యాయి. ఈ మూవీకి ‘హరోం హర’అనే టైటిల్ ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘ది రివోల్ట్‌’ అనేది టైటిల్ క్యాప్షన్‌ గా పెట్టారు. ఇకపోతే ఈ టైటిల్‌ వీడియోలో ‘ఇక చెప్పేదేం లేదు సేసేదే’ అంటూ సుధీర్‌ బాబు విభిన్నమైన యాసతో చెప్పిన డైలాగ్‌ సినీలవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.

హరోంహర టైటిల్ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌ చూస్తే ఆధ్యాత్మిక అంశాలతో కూడిన సినిమాగా ఇది కనిపిస్తోంది. 1989 నాటి ఆంధ్రప్రదేశ్లోని కుప్పం ప్రాంత నేపథ్యంలో సాగే కథ ఇది అంట. ఇందులో సుధీర్‌బాబు.. శివారెడ్డి తనయుడు సుబ్రమణ్యంగా కనిపించనున్నారు. సుమంత్‌ జి.నాయుడు నిర్మిస్తున్న ఈ మూవీలో సుధీర్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి 17 విడుదలవనున్న “వినరో భాగ్యము విష్ణుకథ”

Exit mobile version