Site icon Prime9

Anchor Sreemukhi: సరికొత్త షోకు యాంకరుగా వ్యవహరించనున్న శ్రీముఖి

sreemukhi

Tollywood: ఈటీవీలో ప్రసారమయ్యే ఏ షో ఐనా కొత్తగా డిజైన్ చేస్తారు. ఇదే క్రమంలో మనలని అలరించడానికి సరికొత్త షో ట్రెండీగా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’ అనే రియాలిటీ షో రాబోతుంది.ఈ రియాలిటీ షోకు యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరించనుంది. డైరెక్టర్ అనిల్ కడియాల దర్శకత్వంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ షోను నిర్వహంచనుంది.అనిల్‌ కడియాల దర్శకత్వంలో ఈటీవీలో గత ఆరేళ్లుగా ‘ఆలీతో సరదాగా’ ప్రసారం అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.అంతేకాకుండా ‘వావ్‌’, ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి షోలతో పాటు పండగల పూట ప్రసారమయ్యే స్పెషల్‌ షోలన్ని అనిల్ కడియాల డిజైన్‌ చేసి దర్శకత్వం వహిస్తారు.

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’ ఒకరికి ఒకరు అనే సరికొత్త ట్యాగ్‌లైన్‌తో ఈ షోను డిజైన్‌ చేసి పది ఫేమస్‌ జంటలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ షో నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ షో ఈటీవీలో అక్టోబర్‌ 11న ప్రారంభం అవుతుంది. ఈ షో ప్రతి మంగళవారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఈ షో ద్వారా ప్రముఖ నటి స్నేహ మొదటి సారి జడ్జిగా వ్యవహరించనున్నారు. స్నేహతో పాటు నటుడు శివబాలాజీ కూడా జడ్జిగా ఉంటారని చెప్పారు. ప్రముఖ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి స్పెషల్‌ జడ్జిగా వ్యవహరించటం ఈ షో మొత్తానికి హైలెట్‌ అని ప్రవీణ్ కడియాల అన్నారు.

Exit mobile version