Site icon Prime9

Sivakarthikeyan: రెమ్యూనరేషన్ పెంచిన శివ కార్తికేయ‌న్

sivakarthikeyan prime9news

sivakarthikeyan prime9news

Tollywood: బుల్లి తెర టీవీ యాంకర్‌గా తన జీవితం మొదలుపెట్టి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో  శివ కార్తికేయ‌న్ కూడా ఒకరు. శివ కార్తికేయ‌న్ కొత్త  నిర్ణయాలను తీసుకొని వాటిని అమలు చేయడానికి రెడీగా  ఉన్నారని తెలిసిన  విషయం. తెలుగు సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. తెలుగు అభిమానులకు కూడా దగ్గరవ్వలని నిర్ణయం తీసుకున్నారు. జాతి రత్నాలు ఎంత పెద్ద విజయం సాదించిందో మన అందరికీ తెలుసు. ప్రస్తుతం జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ కేవీతో ప్రిన్స్ అనే కొత్త  సినిమాలో నటిస్తున్నారు. ఈ  సినిమాను తెలుగు, తమిళ భాషల్లో  విడుదల చేయనున్నారు. ఈ దీపావళికి  ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసిన సమాచారం. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, ఏషియన్‌ సినిమాస్‌ సునీల్‌ నారంగ్‌ కలిసి ఈ  సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శివ కార్తికేయ‌న్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్తా తెగ వైరల్ అవుతుంది. శివ కార్తికేయ‌న్ తెలుగులో కూడా  తన రెమ్యూనరేషన్ పెంచేశారని తెలిసింది. కోట్లలో రెమ్యూనరేషన్ పెంచేశారని, ప్రిన్స్ సినిమా కోసం రూ.30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలిసిన సమాచారం. అంతకు ముందు వరకు శివ కార్తికేయ‌న్ రూ.23 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ  సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు తెలిసిన సమాచారం. ఈ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో ఇంకా స్పష్టత రావాల్సి  ఉంది.

Exit mobile version