Site icon Prime9

Sharwanand: సిద్ధార్థ్-అదితీ రావు హైదరీ రిలేషన్ పై శర్వానంద్ కామెంట్స్

Sharwanand

Sharwanand

Tollywood: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావు హైదరి గత సంవత్సరం మహాసముద్రం సినిమా సెట్స్‌లో కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారు డేటింగ్ ప్రారంభించారు. గతేడాది చండీగఢ్‌లో జరిగిన నటుల జంట రాజ్‌కుమార్‌రావు, పాత్రలేఖల వివాహానికి వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. అదితి పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ ‘నా హృదయపూర్వక యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ పెట్టి వీళ్ళు కలిసున్న ఓ ఫోటోని షేర్ చేశాడు. ఇటీవల వారు ముంబై విమానాశ్రయంలో కూడా కనిపించారు. అయితే, ఈ జంట తమ సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు కానీ ఖండించలేదు.

తాజాగా అన్ స్టాపబుల్ సెట్స్‌లో సిద్ధార్థ్ మరియు అదితి రావు హైదరీల సంబంధం పై శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు సాధారణంగా కథానాయికలను ఎలా ఎంచుకుంటారు అని శర్వానంద్‌ను బాలకృష్ణ ప్రశ్నించగా, దానికి నేను చేసేదేమీ లేదు, నా దర్శకులు చెప్పినట్లే చేయడం తప్ప, సెలెక్ట్ చేయడానికి నాకు ప్రత్యేకంగా ఏమీ లేదు అని చెప్పాడు. మరి అదితి రావ్ హైదరీ సంగతేంటి? అని బాలయ్య అడగ్గా శర్వానంద్ బదులిస్తూ ‘ఆమె మహాసముద్రంలో నాకు జోడీగా నటించలేదు. సిద్ధార్థ్‌కి జోడీగా నటించింది.

దానికి బాలయ్య ‘నిజ జీవితంలో కూడా సిద్ధార్థ్‌కి జంటగా మారిందా?’ అని శర్వానంద్‌ను మళ్లీ అడిగాడు. శర్వానంద్ మాట్లాడుతూ నాకు తెలియదు. సిద్ధార్థ్ ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అతను ‘స్వీట్ హార్ట్’ అంటూ ఓ పిక్ పోస్ట్ చేశాడు కానీ నాకు అర్థం కాలేదని అన్నాడు. ‘అంటే పలికిందంటావా’ అంటూ బాలయ్య అడగ్గా, అందుకు శర్వా ‘ఏమో పలికిందేమో’ అన్నాడు.

Exit mobile version