Site icon Prime9

Conductor Jhansi: త్వరలో వెండి తెర పై కనిపించనున్న కండక్టర్ ఝాన్సీ

conducter prime9news

conducter prime9news

Tollywood: కండక్టర్ ఝాన్సీ ఓకె ఒక్క డాన్స్ స్టెప్ వల్ల చాలా క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ కండక్టర్ పాప గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే ఈమె ‘చింపిరి జుట్టు పాటకు వేసినా స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తన డ్యాన్స్‌తో అందరినీ ఫిదా చేసింది. ఈమె ఒక వైపు గాజువాక డిపో కండక్టర్‌గా పనిచేస్తూ, ఇంకో వైపు చిన్న స్టేజ్‌లపై డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేది. గతంలో స్టేజ్‌లపై డ్యాన్స్‌ వేసినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తను చేసిన డాన్స్ పర్ఫామెన్స్‌ ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకుంది.

గాజువాక డిపో కండక్టర్‌గా పదకొండు ఏళ్లు నుంచి పని చేస్తూ తమ్ముడిని ఎంబీఏ చదివించిందట. ఆమె ఈ స్టేజికు వచ్చే ముందు ఎన్నో కష్టాలను, బాధలను తన కుటుంబం కోసం భరించింది.

కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్‌కు హీరో సంపూర్ణేష్ బాబు ఫిదా అయ్యి , ఆమె వివరాలు తెలుసుకుని ఫోన్ చేసి తన సినిమాలో ఐటమ్ సాంగ్‌ చేయాలని చెప్పాడు. సినీ హీరో నుంచి ఫోన్ రాగానే ఝాన్సీ సంతోషానికి అవధులు లేవు. సినిమా ఆఫర్ రావడంతో వెంటనే ఓకె చెప్పేసిందట. తన పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిందని, ఇలాగే మరెన్నో అవకాశాలు రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Exit mobile version