Site icon Prime9

Yashoda: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న యశోద చిత్రం

samantha-yashoda-film-completed-censor-work

samantha-yashoda-film-completed-censor-work

Yashoda: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజా చిత్రం యశోద. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారు మూవీ మేకర్స్. నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

హరి, హరీష్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోలో చేస్తున్న చిత్రం యశోద. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందనలభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.

నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. యాక్షన్ మరియు ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాగా సరోగసి, మెడికల్ క్రైమ్‏ల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

ఇదీ చదవండి: వరుసగా ఐదు ఫ్లాప్‌లు.. అయినా చేతిలో ఐదు సినిమాలు..

 

Exit mobile version