Shaakunthalam: టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం”.
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని
దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. గుణ శేఖర్ ఈ సినిమాని తీస్తున్నారు.
ఈ పౌరాణిక దృశ్యకావ్యాన్ని ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
హిందూ ఇతిహాసాలు ఆధారంగా దేవకన్య అయిన మేనకకి పుట్టిన ‘శకుంతల’ పాత్రలో సమంత కనిపించబోతుంది.
మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంత మహారాజు పాత్ర చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ప్రిన్స్ ‘భారత’ పాత్రలో నటిస్తుంది.
మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ట్రైలర్ లో విజువల్స్ అదిరిపోయాయని చెప్పాలి. అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓ రేంజ్ లో ఉంది.
ఏలేలో ఏలేలో సాంగ్
ఇక మూవీ నుంచి ఒకొక పాటని రిలీజ్ చేస్తూ వస్తున్న మేకర్స్.
తాజాగా ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘ఏలేలో ఏలేలో’ అంటూ సాగే పాట ఒకప్పటి మణిశర్మని గుర్తుకు చేస్తుంది.
ఈ మెలోడీకి చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి పాడాడు.
లిరిక్స్, వాయిస్, మెలోడీతో పాట నాన్ మ్యూజిక్ లవర్స్ మనసుని సైతం హత్తుకునేలా ఉంది.
ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.
Cherishing the journey of love 🤍🦢#YeleloYelelo (Telugu) #Shaakuntalam
▶️ https://t.co/eK38SRA90X@Gunasekhar1 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/3zkPdgf8Np— Samantha (@Samanthaprabhu2) February 1, 2023
కాగా ఈ మూవీ నుంచి ‘మల్లికా మల్లికా’, ‘రుషివనంలోన’ సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.
మణిశర్మ తన పాటలతో, ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో శాకుంతలంకు ప్రాణం పోస్తున్నాడు అనే చెప్పాలి.
ఇప్పటికే షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఫిబ్రవరి 17న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
కానీ ఇప్పుడు ఈ చిత్రం పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూడాలి మరి నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో అని.
మరోవైపు సమంత విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’చిత్రంలో నటిస్తోంది.
త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
మరోవైపు బాలీవుడ్ లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ‘సిటాడెల్’సిరీస్ ఆధారంగా ఇండియన్ వెర్షన్ లో నిర్మిస్తున్న స్పై థ్రిల్లర్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్నారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు.
నిన్న విడుదైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/