Site icon Prime9

Sakala Gunabhi Rama Movie: “సకల గుణాభి రాముడి”గా ప్రేక్షకుల ముందుకు రానున్న “వీజే సన్నీ”

sakala gunabhi rama movie

sakala gunabhi rama movie

Tollywood: బిగ్ బాస్ ఫేమ్ విజె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం సకల గుణాభి రామ. ఈ సినిమాకు శ్రీనివాస్ వెలిగొండ దర్శకుడిగా వ్యవహరించగా సంజీవ్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. శ్రీతేజ్, తరుణీ సింగ్, జెమినీ సురేష్, సరయూ, చమ్మక్ చంద్ర, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీని సెప్టెంబర్ 16న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆది నారాయణ ఎస్కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బిగ్ బాస్ ఫేమ్ నటులు సోహైల్, మానస్, జెస్సి, హమీద, యాంకర్ రవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా చిన్న చిత్రాలు విడుదలకి చాలా ఇబ్బంది పడుతున్నాయని, కానీ తమ నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సకల గుణాభి రామ చిత్రాన్ని నిర్మించారని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. లాక్ డౌన్ లో చిన్న సినిమాగా ప్రారంభమయిన సకల గుణాభి రామ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో విడుదలవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

ఈ చిత్రం 100 థియేటర్స్ లో సెప్టెంబర్ 16 న విడుదల అవుతుందని, ఇది ఒక కుటుంబ కథా చిత్రమని, అందరికీ బాగా నచ్చుతుందని డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణ తెలిపారు. నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన నా మిత్రులందరికీ కృతజ్ఞతలని హీరో సన్నీ తెలిపారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేసామని, ప్రేక్షకులందరూ తమ సినిమాని చూసి హిట్ చెయ్యాలని వీజే సన్నీ కోరారు.

ఇదీ చదవండి: Tollywood News: త్వరలో వెండితెరపై “బాక్స్ బద్దలవుద్ది”..!

 

Exit mobile version