Site icon Prime9

Sai Dharam Tej : “ఎందుకు ? ఇంత పని చేశావ్ రా వరుణ్ బాబు” అంటున్న సాయి ధరమ్ తేజ్..

sai-dharam-tej-viral-post-about-varun-marriage

sai-dharam-tej-viral-post-about-varun-marriage

Sai Dharam Tej : ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెద్ధల అంగీకారంతో ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.మెగా, అల్లు, కామినేని కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి వేడుకలలో ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను పెళ్లిలో వరుణ్, లావణ్య ధరించారు. ఈ పెళ్ళికి మెగా ఫ్యామిలీ అంతా ఎంతో సందడి చేశారు. ఇప్పటికే వరుణ్ లావణ్య పెళ్లి ఫొటోలు చాలా బయటకి రాగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్.. వరుణ్ లావణ్య పెళ్లి నుంచి ఆసక్తికర ఫొటోలు షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.

తేజ్, వరుణ్ బావ బామ్మర్దులు అవుతారని తెలిసిందే. మెగా ఫ్యామిలీ కజిన్స్ అంతా ఎప్పుడూ సరదాగా కలిసే ఉంటారు. పండగలు, పార్టీలు కలిసే సెలెబ్రేట్ చేసుకుంటారు. వీరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. తాజాగా తేజ్ షేర్ చేసిన ఫొటోల్లో.. వరుణ్ కార్ లో పెళ్లి వేదిక వద్దకు వెళ్తుంటే తేజ్ మధ్యలో ఆపేసి కార్ మీద కాలు పెట్టి ఎందుకు చేసుకుంటున్నావ్ పెళ్లి, సింగిల్ లైఫ్ ని వదిలేస్తున్నావు అంటూ సరదాగా ప్రశ్నించాడు.

 

తేజ్ ఈ ఫోటోలను షేర్ చేసి అందులో  ఎందుకు? ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. అంటూ ఆసక్తిగా పోస్ట్ పెట్టాడు. అయితే ఇదంతా పెళ్ళిలో సరదాగా జరిగిందే అని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు తేజ్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. గతంలో వరుణ్.. పెళ్లిపై కామెడీగా తీసిన F2, F3 సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ధానిలో విధం గానే సరదాగా తేజ వరుణ్ పై అలా పోస్ట్ పెట్టాడు . బావ బామ్మర్దుల మద్య ఆ మాత్రం సరదా వుండడం ఎంతో బాగుంటుంది . మెగా ఫ్యామిలీ కజిన్స్ అంతా ఎప్పుడూ సరదాగా కలిసే వుండాలి అనేదే మెగా ఫ్యామిలీ అభిమానుల కోరిక .

 

 

Exit mobile version