Site icon Prime9

Ravi Teja: దీపావళి రేసులో ’ధమాకా‘

RAVITEJA

RAVITEJA

Tollywood: మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్లగా నిలిచాయి. ప్రస్తుతం రవితేజ ధమాకా షూటింగ్‌ను పూర్తి చేసారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21వ తేదీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ధమాకా యాక్షన్‌తో కూడిన కామిక్ ఎంటర్‌టైనర్. త్రినాథరావు నక్కిన దర్శకుడు కాగా, శ్రీలీల కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాతలు. భీమ్స్ సంగీతం సమకూర్చాడు.

నిర్మాతలు త్వరలో ఈ చిత్రం విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేయనున్నారు. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాల్లో నటిస్తున్నాడు.

Exit mobile version