Site icon Prime9

Ram Charan-Upasana: రామ్ చరణ్ కూతురి పేరేంటో తెలుసా?.. ఎంత వెరైటీగా ఉందో

Ram Charan-Upasana

Ram Charan-Upasana

Ram Charan-Upasana: మెగాపవర్ స్టార్, గ్లోబర్ స్టార్ అయిన రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగాప్రిన్సెస్ అడుగుపెట్టింది. జూన్ 20న ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డ‌కి జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలిలోనే కాకుండా అభిమానుల్లో సైతం సంతోషం నెలకొంది. ఇక మెగా వారసురాలిని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా మెగాప్రిన్సెస్ కి ఏ పేరుని పెడుతున్నారు? అని పలురకాల ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆల్రెడీ తన కూతురికి తాము ఒక పేరు అనుకున్ననట్లు ఇటీవల ఓ రామ్ చరణ్ తెలిపారు. ఆ పేరుని తన పాప బారసాల నాడు తానే అందరికి తెలియజేస్తాను అని కూడా రాంచరణ్ తెలిపాడు.

అమ్మవారి శక్తి స్వరూపంగా పేరు(Ram Charan-Upasana)

కాగా నేడు చరణ్ ఉపాసనల పాప బారసాల ఘనంగా నిర్వహించారు. చిరంజీవి ఇంట్లోనే ఈ వేడుక అట్టహాసంగా జరిగినట్టు సమాచారం. ఉపాసన ఇప్పటికే ఆ వేడుకకి సంబంధించిన డెకరేషన్ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలిని ఊయలలో వేసిన ఫోటోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసి మెగా ప్రిన్సెస్ పేరును వెల్లడించారు. రామ్ చరణ్, ఉపాసనల కూతురి పేరు ‘క్లిం కార’ అని పెట్టారు. దీనితో ఈ పేరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ఇంత కొత్తగా, వెరైటీగా ఉందని భావిస్తున్నారు.


అయితే చిరంజీవి దీని గురించి షేర్ చేస్తూ.. ‘క్లిం కార’ అనేది లలితాసహస్రనామం నుంచి తీసుకున్నాము. ఈ పేరు అర్థం ప్రకృతి అని, శక్తి అని వస్తుందని వెల్లడించారు. ఆ పేరుతో ఒక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్ ఉందని ఆయన తెలిపారు. ఈ లక్షణాలని మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వంలో పెరిగేకొద్దీ ఇమడ్చుకుంటుందని నమ్ముతున్నాము అని ట్విట్టర్ ద్వారా చేశారు. దీంతో ఇప్పుడు చరణ్ కూతురి పేరు వైరల్ గా మారింది. చిరంజీవి, సురేఖతో పాటు ఉపాసన తల్లితండ్రులు శోభన అనిల్ కూడా ఉన్న ఫోటోని చిరంజీవి షేర్ చేశారు.

Exit mobile version