Site icon Prime9

Sharwanand: శర్వానంద్ తో తొలిసారి నటిస్తున్న రాశిఖన్నా

Sharwanand-Raashi-Khanna-movie

Tollywood: హీరో శర్వానంద్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు మాత్రమే చేస్తానని ఇటీవల ప్రకటన చేశాడు. శర్వానంద్ తన 33వ సినిమా కోసం కృష్ణ చైతన్యతో జతకట్టాడు. శర్వానంద్ 33వ చిత్రం విభిన్నమైన కథ మరియు శక్తివంతమైన పాత్రలతో కూడిన రాజకీయ యాక్షన్ డ్రామా. కృష్ణ చైతన్య డైనమిక్ కథను రాసుకున్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈరోజు ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. తొలి షాట్‌కు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్‌ ఇచ్చారు.

వచ్చే నెల నుంచి సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా శర్వానంద్ తో మొదటిసారి కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి ఒక ముఖ్యమైన పాత్రకు ఎంపికైంది. శర్వా నంద్ నటించిన ఒకే ఒక జీవితం ఈ నెల 9న విడుదల కానుంది.

Exit mobile version