Site icon Prime9

NBK107: వీరసింహారెడ్డి: సింహం వేటకు సిద్ధమైంది

VEERASIMHAREDDY

Tollywood: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న #NBK107 చిత్రం కోసం “వీరసింహా రెడ్డి” అనే టైటిల్‌ను లాక్ చేసారు ఫిల్మ్ మకర్స్. బాలకృష్ణ ఇంతకుముందు సింహా అనే టైటిల్స్‌తో అనేక సినిమాలు చేసాడు మరియు వాటిలో చాలావరకు కమర్షియల్ హిట్స్. టైటిల్ పోస్టర్‌ను కొండా రెడ్డి బురుజు (కర్నూలు) పై 3డి చిత్రంగా ప్రత్యేక పద్ధతిలో ఆవిష్కరించారు. ఇలా ఒక తెలుగు చిత్రానికి టైటిల్ లాంచ్ చేయడం ఇదే తొలిసారి.

“వీరసింహారెడ్డి” అనే టైటిల్ బాలకృష్ణ పాత్ర గొప్పతనాన్ని వివరిస్తుంది మరియు టైటిల్ లోగోలో గర్జించే సింహాన్ని మనం గమనించవచ్చు.గాడ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ టైటిల్ లాగే ఆకట్టుకుంటుంది. వేటకు సిద్ధమైన సింహంలా బాలకృష్ణ కనిపిస్తున్నారు.అతని వద్దకు కార్ల గుంపు వస్తుండగా, బాలకృష్ణ మైలురాయి వద్ద ఉంచిన మారణాయుధంతో వేటకు సిద్ధంగా ఉన్నాడు.

స్పోర్టింగ్ షేడ్స్, గ్రే-హెయిర్డ్ లుక్‌లో బాలకృష్ణ అదరగొట్టాడు. మాస్ లీడర్ లాగా నల్ల ఖాదీ చొక్కా, లుంగీ కట్టుకున్నాడు. టైటిల్,పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. 2023 సంక్రాంతికి వీరసింహా రెడ్డి రాబోతున్నట్లు పోస్టర్ కన్ఫర్మ్ చేస్తోంది.

Exit mobile version