Site icon Prime9

National Film Awards 2022: జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి కుటుంబంతో హాజరైన హీరో సూర్య

surya prime9news

surya prime9news

National Film Awards 2022: 68వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. 2020 ఏడాదికి గాను పలు చిత్రాల్లో ఉత్తమ చిత్రాలను ఇటీవల ఎంపిక చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న అవార్డులను అందజేశారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నటీనటులు అందుకున్నారు. ఢిల్లీలోని విఘ్నయన్ భవన్‌లో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్ హాజరయ్యారు.

జాతీయ ఉత్తమ చిత్రంగా ‘సూరయైపొట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) సినిమా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా నటించిన సూర్య ఉత్తమ హీరోగా అవార్డును అందుకోగా, ఇదే సినిమాలో నటించిన హీరోయిన్ అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ వేడుకకు హీరో సూర్య తన భార్య జ్యోతిక మరియు తన పిల్లలతో కలిసి హాజరయ్యారు. సూర్య అవార్డు అందుకునే సమయంలో జ్యోతిక ఫొటో తీయడం, జ్యోతిక అవార్డు అందుకునే సమయంలో సూర్య ఫొటోలు తీయడం అటు సినీ ప్రేక్షకులను ఇటు అభిమానులందరిని ఆకట్టుకుంది.

Exit mobile version