Site icon Prime9

Nagarjuna The Ghost Movie: హిందీలోనూ నాగ్ “ది గోష్ట్” సినిమా

Nagarjuna the ghost movie review

Nagarjuna the ghost movie review

Nagarjuna The Ghost Movie:  ఈ మ‌ధ్య హీరోలంద‌రూ వాళ్ళ మార్కెట్‌ ను దేశమంత‌టా విస్త‌రించాలని య‌త్నిస్తున్నారు. ఒక‌ప్పుడు ఒక వారివారి రీజనల్ భాషలకే ప‌రిమిత‌మైన సినిమా ఇప్పుడు అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతూ మంచి విజ‌యాల‌ను సాధిస్తుంది. సినిమాలో కంటెంట్ ఉంటే భాష‌తో సంబంధంలేకుండా ప్ర‌తి ఒక్క‌రు చిత్రాన్ని ఆద‌రిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా టాలీవుడ్‌ చిత్రాలు పాన్ ఇండియా లెవలెలో రిలీజ్ అవుతున్నాయి. ‘బాహుబ‌లి’ద‌గ్గ‌ర నుండి రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ‘కార్తికేయ‌-2’చిత్రం వ‌ర‌కు జాతీయ స్థాయిలో విడుద‌లై సంచ‌ల‌న విజయాలను కైవసం చేసుకున్నాయనే చెప్పవచ్చు. ఇక ఇప్పుడు హీరోలంతా విభిన్న జాన‌ర్‌లో సినిమాల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ ముందు అలరిస్తున్నారు. కాగా ఈ క్ర‌మంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా త‌న సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఆరు ప‌దుల వ‌య‌సులోనూ నవ మన్మథుడిలా యువ హీరోల‌కు ధీటుగా యాక్ష‌న్ క‌థ‌ల‌ను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ సీనియర్ స్టార్ హీరో. అయితే ప్రస్తుతం ఈయ‌న న‌టించిన ది ఘోస్ట్ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడిగా తెరకెక్కనున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న లభించింది.

ఈ నేపథ్యంలో ది ఘోస్ట్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుద‌ల చేయ‌డానికి మూవీ మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ మూవీలో నాగార్జున ఇంట‌ర్‌పోల్ ఆఫిస‌ర్‌గా క‌నిపించనున్నాడు. నాగార్జున‌కు జోడీగా సోనాల్ చౌహ‌న్ న‌టిస్తుంది. అంతేకాకుండా బ్ర‌హ్మ‌స్త్ర చిత్రంతో నాగార్జున‌కు హిందీలో మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇక ఈ క్రేజ్ ఈ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: Nag 100th Movie: నలుగురు దర్శకులకు నాగ్ 100వ సినిమా బాధ్యతలు.. వారెవరంటే..!

Exit mobile version