Site icon Prime9

Mega 154: “మెగా154” మాస్ గ్లింప్స్ అదిరింది.. ఫ్యాన్స్ కు ఇంక పూనకాలే..!

Mega 154 teaser glimpse

Mega 154 teaser glimpse

Mega 154: ఫలితం ఆశించకుండా మెగాస్టార్‌ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయాయి. కాగా ప్రస్తుతం చిరంజీవి మెగా కంబ్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ‘ఖైదీ నెం.150’తర్వాత చిరుకు ‘సైరా’, ‘ఆచార్య’ ఆశించిన ఫలితాలు ఇవ్వక తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవలే రిలీజైన ‘గాడ్‌ఫాదర్’ పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బ్రేక్‌ ఈవెన్‌ కోసం కష్టపడుతుంది. ఈ తరుణంలో #MEGA154 నుంచి వచ్చిన తాజా అప్ డేట్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫుల్ మాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మెగా154’ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను దీపావళి సందర్భంగా రిలీజ్‌ చేయనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టైటిల్‌ టీజర్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు చిత్ర యూనిట్. ఫ్యాన్స్ కు ఇంక పూనకాలే అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: ఆదిపురుష్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్.. అప్డేట్ చూసి ఏడుస్తున్న జనం

Exit mobile version