Site icon Prime9

Maya Petika: ఆడియెన్స్ ధైర్యంతోనే “మాయా పేటిక” సినిమా చిత్రీకరణ.. నిర్మాత శరత్

Maya Petika film was shot with the courage of the audience

Tollywood: జ‌స్ట్ ఆర్టిన‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై ప్రొడ‌క్ష‌న్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. ర‌మేష్ రాపార్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సినిమాకు గుణ బాల సుబ్ర‌మ‌ణియ‌మ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తుండ‌గా సురేష్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అనసూయ భరద్వాజ్ విడుదల చేశారు. సినిమాలో పాయల్ రాజ్ పుత్, రజిత్ రాఘవన్, సునీల్, యాంకర్ శ్యామల, సిమ్రత్ కౌర్ తదితరులు నటించారు.

ఈ సందర్భంగా పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ అభిమానుల ప్రేమ, సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇలాంటి సినిమా చేయాలంటో ఎంతో రీసెర్చ్ చేయాలి. ఇలాంటి కారెక్టర్ ఉన్న సినిమా అరుదుగా వస్తుంటాయి. డైరెక్టర్ రమేష్, నిర్మాత శరత్ తో పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

ఇంకా తదితర చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ఓ ఫోన్ మన జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో ఈ సినిమాలో చూపించాం. ప్రతీ ఒక్కరి జీవితంలో ఫోన్ ఎంతో ఇంపార్టెంట్‌గా ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఈ ఫోన్ ఆటాడుకుంటుంది అని తెలిపారు. చిత్రంలో నక్కిలెసు గొలుసు నారాయణగా సునీల్ వాచ్ మెన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ లేకుండా జీవితం ముందుకు సాగదు. ఫోన్ అంటే ఉండే డిఫరెంట్ ఆలోచనల్లోకెల్లా మాయాపేటికతో మరొక కొత్త ఆలోచనలో మూవీని తెరకెక్కించారు.

ఈ చిత్రంలో కోతికి దొరికిన ఫోన్ ద్వారా జీవితంలో చోటుచేసుకొన్న మార్పులు ఆసక్తికరంగా ఉండేలా చిత్రీకరించారు. ఫోన్ మీద సినిమా తీశామని ఫోన్‌లో చూడొద్దుంటూ థియేటర్లోనే చూడండి’ అని ప్రేక్షక లోకానికి తెలిపారు. ఈ సినిమాలో మంచి విజువల్స్, మంచి సాంగ్స్, సరికొత్తీ కామెడీతో ఓ ఫుల్ ప్యాకేజీ సినిమాగా రూపుదిద్దారు.

అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. సినిమా అందరికీ నచ్చుతుంది. నేను ఈ సినిమాలో లేకున్నా చెబుతాన్నంటే అర్థం చేసుకోండి. నన్ను అందరూ చాలా సెల్ఫీష్ అని అందరూ అంటుంటారు. కానీ నేను లేకున్నా సినిమా బాగుందని చెబుతున్నానంటే అర్థం చేసుకోవాలి. చాలా బాగుంటుంది సినిమా. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: Tollywood: సినీ ఇండస్ట్రీలో నటుడు ప్రభాస్ @ 20 ఇయర్స్

Exit mobile version