Site icon Prime9

Mahesh New Business: మహేశ్ బాబు సరికొత్త బిజినెస్..!

mahesh babu new record in twitter

mahesh babu new record in twitter

Mahesh New Business: సినిమా హీరోగానే కాకుండా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి పేరు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాలతో మరోవైపు బ్రాండ్ ఎంబాసిడర్ గా చిత్రపరిశ్రమలో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్. అలా రెండు చేతులా బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే సంపాదించడం మాత్రమే కాక మంచి చోట్ల పెట్టుబడులు పెట్టడంలోనూ మహేష్ బాబు స్మార్ట్ అని చెప్పవచ్చు. ఇలా సినిమాల్లో, వ్యాపారంలోనూ రానిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు మన ప్రిన్స్. అయితే ఇటీవల కాలంలో ఏషియన్ గ్రూప్ వారితో కలిసి ఏఎంబి సినిమాస్ ను నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా తాజాగా ఇప్పుడు మహేష్ బాబు ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ ఒక రెస్టారెంట్ బిజినెస్ ని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బిజినెస్లో మహేష్ నేరుగా ఇన్వెస్ట్ చేయకుండా మినర్వ గ్రూప్‌తో కలిసి పార్ట్‌న‌ర్‌షిప్‌లో క‌లిసి తీసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఒక బడా ప్రాంతంలో మహేష్ బాబుకి ఒక పెద్ద ల్యాండ్ ఉంది. అయితే ఆ లాండ్ ఒక పాపులర్ రెస్టారెంట్ చైన్ వారికి బాగా నచ్చింది. దానితో వారు మహేశ్ను ఆశ్రయించారు. ఆ రెస్టారెంట్ కాన్సెప్ట్ మరియు ఐడియా కూడా మహేష్ బాబు కి నచ్చటంతో ఆ ల్యాండ్ లోనే ఆ రెస్టారెంట్ ని పెట్టేందుకు మహేష్ అంగీకారం తెలిపినట్టు సమాచారం.

ఇదీ చదవండి: అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్ ను తగులబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

Exit mobile version