Site icon Prime9

Tollywood: నరేష్ కు తోడేలు బెడద.. ఈ వారం రానున్న సినిమాలు ఇవే..!

this week movie releases

this week movie releases

Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ నాట తమిళ సినిమా వర్సెస్ తెలుగు సినిమా పోరు నడుస్తుంది. సంక్రాంతికి తెలుగు సినిమాలు డబ్బింగ్ సినిమాలు అంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల విషయంలోనూ అదే రకమైన గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. నవంబర్ 25వ తేదీన ముఖ్యంగా మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి.

Itlu Maredumilli Prajanikam (2022) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

అల్లరి నరేష్ హీరోగా నటించిన మారేడు మల్లి ప్రజానీకం అనే సినిమా నవంబర్ 25వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Love Today (2022) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఇకపోతే ఈ సినిమాతో పాటుగా దిల్ రాజు రిలీజ్ చేస్తున్న లవ్ టుడే అనే తమిళ డబ్బింగ్ సినిమా కూడా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. అక్కడ సుమారు 50 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు దిల్ రాజు

Category: Movies - Page 3 - Telugu 70MM

అదే రోజున నంబర్ 25న అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి తోడేలు సినిమా కూడా వస్తోంది. హిందీలో వరుణ్ ధావన్, కృతి సనన్ హీరో హీరోయిన్ గా నటించి భేడియా పేరుతో రిలీజ్ అవుతున్న సినిమాని తెలుగులో తోడేలు పేరుతో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ రెండుడబ్బింగ్  సినిమాలకి పెద్ద ఎత్తున థియేటర్లు కేటాయిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ దెబ్బతో డైరెక్ట్ తెలుగు ఫిలిం అయిన మారేడుమల్లి ప్రజానీకం సినిమాకి థియేటర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

ఇకపోతే ఆదిసాయికుమార్ పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా తెరుకెక్కుతున్న చిత్రం కిరాత. ఈ చిత్రానికి వీరభద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీ నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంతేకాకుండా బుల్లితెర రాములమ్మగా పేరుపొందిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇట్స్ టైం టు పార్టీ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది. ఈ సినిమాకు గౌతమ్ ఇవిఎస్ దర్శకత్వం వహించారు.

 

Exit mobile version
Skip to toolbar