Site icon Prime9

Nenevaru Movie: విడుదల సన్నాహాల్లో లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ “నేనెవరు”

Love and suspense thriller Nenevaru movie is getting ready for release

Tollywood: కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ గా తెరపైకెక్కించిన “నేనెవరు” చిత్రం విడుదలకు సిద్ధమైంది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా, నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో ‘నేనెవరు’ చిత్రాన్ని లవ్ అండ్ సస్పెన్స్ ధ్రిల్లర్ గా చిత్రీకరించారు. సెన్సార్ పూర్తి చేసుకొన్న “నేనెవరు” చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా చిత్రంలోని పాటలు కృష్నకాంత్, సంగీతం ఆర్.జి. సారధిలు అందించారు.

తనిష్క్ రాజన్, గీత్ షా లు సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి ప్రభాకర్ విలన్ గా, రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం “నేనెవరు” కావడం విశేషం. ఈ చిత్రానికి కెమెరా సామల భాస్కర్, ఎడిటింగ్ కోలా భాస్కర్ ఫైట్స్ రియల్ సతీష్, కొరియోగ్రఫీ చంద్రకిరణ్ లు చిత్ర నిర్మాణంలో తమవంతు పాత్రను పోషించారు.

ఇదికూడా చదవండి: Censor Board: సెన్సార్ బోర్డు సభ్యుడిగా శ్రీహరి తమ్ముడు ఆర్. శ్రీధర్

Exit mobile version