Site icon Prime9

Mayilsamy: సినీ పరిశ్రమలో మరో విషాదం.. తమిళ స్టార్ కమెడియన్ మయిల్‌స్వామి ఇకలేరు

Mayilsamy

Mayilsamy

Mayilsamy: చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ఏమంటూ వచ్చిందో అప్పటి నుంచి ప్రముఖులంతా వరుసగా ఈ లోకాన్ని వీడుతున్నారు. ఇటీవల కృష్ణం రాజు, కృష్ణ, సత్యనారాయణ, చలపతిరావు, జమున, దర్శకుడు విశ్వనాథ్, వాణీ జయరామ్, పలువురు మృతి చెందగా.. ఈరోజు తారకరత్న మరణ వార్తను సినీ నటులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వరుస మరణాలు మరువక ముందే తమిళ ఇండస్ట్రీలో మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ కోలీవుడ్‌ హస్యనటుడు మయిల్‌స్వామి కన్నుమూశాడు. ఈ విషాద వార్తతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది.

దిగ్బ్రాంతిలో కోలీవుడ్

ఈరోజు తెల్లవారు జామున మయిల్‌ స్వామి అస్వస్తతకు గురయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు సమీపంలోని పోరూర్‌లోని ఆసుపత్రికి ఆయన్ను తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్‌లు నిర్ధారించారు. మయిల్‌ స్వామి(Mayilsamy) మరణంతో తమిళ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురయ్యింది. ఆయన మరణం పట్లు పలువురు కోలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మయిల్‌ స్వామి 1984లో సినీరంగ ప్రవేశం చేశారు. ధవని కనవుగల్‌ అనే తమిళ సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. తన మార్క్ కామెడీతో ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ దృష్టిలో పడ్డాడు. దాంతో ప్రేక్షకుల ఆదరణతో వరుస అవకాశాలు మయిల్ స్వామిని వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటి నుండి మయిల్‌స్వామి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు.

తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే అని చెప్పాలి. దాదాపు 40 ఏళ్లుగా పరిశ్రమలో ఉంటూ 200 పైగా సినిమాలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు మయిల్ స్వామి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ది లెజెండ్‌ సినిమాలోనూ మయిల్‌స్వామి మంచి పాత్ర పోషించాడు. ఈయన మృతికి తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు కమల్ హాసన్, రజనీ కాంత్, పలువురు ప్రముఖ హీరోలు సంతాపం ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ నివాళులు అర్పిస్తున్నారు.

Exit mobile version