Site icon Prime9

Hero Santhosh Shoban: అప్పుడు నేను బాగా ఉద్వేగానికి లోనయ్యా.. హీరో సంతోష్ శోభన్ పోస్ట్

santhosh shoban emoshanal post

santhosh shoban emoshanal post

Hero Santhosh Shoban: నిత్యనూతన కథలతో ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్ తను నేను చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పేపర్ బాయ్ తో క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకుని, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నారు. కాగా ఇటీవల లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే డిఫరెంట్ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్ శోభన్ ఈ సినిమా ద్వారా మంచి పేరే తెచ్చుకున్నారు.

అయితే తాజాగా సంతోష్ శోభన్ సోషల్ మీడియా ద్వారా ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. అందులో ఆయన స్పందిస్తూ… నేను 2010లో తొలిసారి కెమెరా ముందుకొచ్చాను. నా ఫేవరేట్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో గోల్కొండ హైస్కూల్ చిత్రంలో నటించాను. ఈ సినిమాలో నా డైలాగ్స్ చెప్పినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. నేను నా కలను సాకారం చేసుకున్న అనుభూతి కలిగింది. ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు కెమెరా ముందుకొచ్చినా నా డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకుంటున్నానని ఆనందపడుతుంటా. ఇదే ఆనందాన్ని నిత్యం పొందేందుకు మంచి కథల్లో నటిస్తూ, మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయాలనుకుంటున్నాను. నా లేటెస్ట్ మూవీ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ కు మీరు చూపించిన ఆదరణ, మా వెంట మీరున్నారనే ధైర్యాన్నిచ్చింది. నా సోదరుడు దర్శకుడు మేర్లపాక గాంధీ, నాయిక ఫరియా అబ్దుల్లా ఇతర సభ్యులందరికీ నా కృతజ్ఞతలు అని ఆయన చెప్పుకొచ్చారు.

సంతోష్ శోభన్ ప్రస్తుతం ఈయన పలు చిత్రాలను టేకోవర్ చేసి బిజీబిజీ షూటింగ్ లతో గడుపుతున్నారు. స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్ నిర్మాణంలో నందినీరెడ్డి దర్శకత్వంలో “అన్ని మంచి శకునములే” అనే సినిమాలో సంతోష్ శోభన్ నటిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎన్టీఆర్ నయా లుక్.. సూపర్ ట్రెండీ గురూ..!

Exit mobile version