Site icon Prime9

Gruha lakshmi: అక్టోబర్ 03 ఏపిసోడులో తులసిని అవమానించిన సామ్రాట్ !

gruha lakshmi 03 oct prime9news

gruha lakshmi 03 oct prime9news

Gruha lakshmi: గృహలక్ష్మీ ఏపిసోడులో ఈ రెండు సీనులు హైలెట్

ఇక తులసికి చదువురాకపోవడంతో తన అసిస్టెంట్ ఝాన్సీ సాయం తీసుకొని ఫైల్స్‌పై ఆమె ఎక్కడ చెప్తే అక్కడ సంతకాలు చేస్తుంది తులసి.దాన్ని అవకాశంగా తీసుకొని లాస్య కొత్త స్కెచ్ ప్లాన్ చేస్తుంది.ఝాన్సీతో పెండింగ్ ఫైల్‌పై సంతకం చేయించేట్టు ప్లాన్ చేస్తుంది.ఈ ఫైల్ సామ్రాట్ సార్ చూశారా? సమస్య ఏమీ లేదా అని తులసి అడుగుతుంది.ఝాన్సీ ఏ సమస్య ఉండదని చెప్పి ఆ ఫైల్‌పై సంతకం చేయిస్తుంది.నువ్ నాకు సహాయం చేస్తున్నావ్ కాబట్టి.. సరిపోయింది లేదంటే నా పని ఇంకా కష్టం అయ్యేది..నన్ను సామ్రాట్ గారు ఎంత నమ్ముతున్నారో..నేను నిన్ను అంత నమ్ముతున్నాను ఝాన్సీ అని చెప్పి తులసి సంతకం చేస్తూ ఉంటుంది.అయితే అప్పడే సామ్రాట్ వచ్చి తులసి‌తో మాట్లాడకుండగానే వెళ్లిపోతాడు.

తులసిన అవమానించిన సామ్రాట్

ఇంతలో లాస్య వచ్చి ఏమైంది సార్ అని అడిగేసరికి..తులసి పెద్ద గణకార్యం చేసింది.. పదికోట్ల పెండింగ్ పేమెంట్‌కి సంబంధించిన పాత ఫైల్‌పై సంతకం పెట్టింది..కంపెనీకి పది కోట్లు నష్టం వచ్చేటట్లు చేసింది నందు అని అంటాడు.ఇంతలో సామ్రాట్ వస్తాడు..థాంక్యూ నందు గారూ..పది కోట్లు నష్టం నుంచి కంపెనీని కాపాడారు..నాకు కావాల్సింది ఇలాంటి మనుషులే అని సామ్రాట్ అంటాడు.తప్పు ఎక్కడ జరిగిందో తులసిని అడగొచ్చు కదా.. అని సామ్రాట్ అని అనడంతో…ప్రతి తప్పుకి ఒక కారణం ఉంటుంది బాబాయ్..అలాగని హంతకుడు కాకుండా పోతాడా? అని అంటాడు సామ్రాట్. అంటే నువ్వు తులసిని తప్పుబడుతున్నవా ? అని వాళ్ల బాబాయ్ అనడంతో..తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే..బాబాయ్,దానికి శిక్ష అనుభవించాల్సిందే అని సామ్రాట్ అంటాడు.

Gruha lakshmi: సెప్టెంబర్ 29 ఏపిసోడులో ఈ అమ్మ మీకు ఎప్పటికి కనిపించదంటూ ఎమోషనల్ అయిన తులసి!

Exit mobile version