Site icon Prime9

Tollywood News: “మాతృదేవోభవ నా మొదటి సినిమా కావడం నా అదృష్టం”

mathrudevobhava latest movie

mathrudevobhava latest movie

Tollywood News: తెలుగు సినీపరిశ్రమలో దిగ్గజ డైరెక్టర్లైన కోడి రామకృష్ణ, రేలంగి నరసంహారావు, ఇవివి సత్యనారాయణ వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో సుదీర్ఘకాలం పని చేసిన కె.హరనాథ్ రెడ్డి “మాతృదేవోభవ”( ఓ అమ్మ కథ) చిత్రంతో దర్శకుడిగా వెండి తెరపై పరిచయవుతున్నాడు. కాగా తొలి ప్రయత్నంలోనే ఈ సినిమా ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నాడు ఈ డైరెక్టర్. శ్రీవాసవి మూవీస్ పతాకంపై ఎమ్.ఎస్.రెడ్డి సమర్పణలో చోడవరపు వెంకటేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు.

సీనియర్ నటి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో సుమన్, రఘుబాబు, పోసాని, పతంజలి శ్రీనివాస్, శ్రీహర్ష, అమృతా చౌదరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో అసాధారణ రీతిలో స్పందనను చూరగొనింది. “మాతృదేవభవ” సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చమర్చిన కళ్లతో తనను మెచ్చుకున్నారని, సందేశానికి వినోదం జోడించి అద్భుతంగా తీశావని తనను అభినందించారని డైరెక్టర్ హరనాథ్ రెడ్డి తెలిపారు.
ముఖ్యంగా ఈ మూవీలో సుధ గారి నటనకు అవార్డ్స్ రావడం ఖాయమని పలువురు ముక్త కంఠంతో చెబుతుంటే చాలా సంతోషంగా సంతృప్తిగా ఉందని ఆయన వివరించారు. తల్లి సెంటిమెంట్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిమని, ఇంత మంచి చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం తనకు చాలా గర్వంగా ఉందని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే రోజు రావాలి.. రాజకీయాలపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్

Exit mobile version