Site icon Prime9

Coffee with a Killer trailer: ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్ రిలీజ్

COFFEE

COFFEE

Tollywood: ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని దర్శకత్వం వహించిన చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆర్.పి గారు ఏ క్రాఫ్ట్‌కు వెళ్ళినా సక్సెస్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే మేము టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆయన కంపోజ్ చేసిన పాటలే ఎక్కువగా వినే వాళ్ళం. ఆ పాటలే లేకుంటే మా టీనేజ్ అంతా ఏమైపోయేదో, మమ్మల్ని అంత ఇంప్రెస్ చేశాయి. ఇక ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరితో నా కెరీర్ మొదటి నుంచి కలిసి ట్రావెల్ చేశాను. ఫ్రెండ్స్ మధ్య ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ, టీమ్‌కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అన్నారు. దర్శకుడు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ ఓటిటి వచ్చాక జనాలకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్‌కు రప్పించలేము అనిపించే ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ సినిమా కథను రాసుకొని డైరెక్ట్ చేయడం జరిగిందని అన్నారు.

ఈ చిత్రానికి నిర్మాత సెవెన్‌హిల్స్ సతీష్ మాట్లాడుతూ ఆర్ పి గారితో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘు కుంచె, జెమినీ సురేష్, బెనర్జీ, రవి ప్రకాష్, గౌతమ్ పట్నాయక్, అనుష్, తిరుమల నాగ్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version