Site icon Prime9

Boyfriend for Hire: అక్టోబర్ 14న వస్తున్న ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’

boy friend

boy friend

Tollywood: ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది అక్టోబర్ 14న రాబోతున్న ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’. మునుపెన్నడూ లేని కాన్సెప్ట్ యువతను ఆకట్టుకుంటోంది. ఇటీవల DJ టిల్లు యువతను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇపుడు బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ కూడ అదే జోనర్ లో ఉంటుందని భావిస్తున్నారు. పిల్లలు డాక్టర్, ఇంజనీర్, అకౌంటెంట్ లేదా ఆర్కిటెక్ట్ వంటి వృత్తులను ఎంచుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ ఈ సినిమాలో కథానాయకుడు ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ని తన వృత్తిగా ఎంచుకుంటాడు.

అమ్మాయిలు అతనిని ఎందుకు సంప్రదించాలి మరియు వృత్తి రీత్యా బాయ్‌ఫ్రెండ్ అయ్యేలా చేసింది ఏమిటి అనేది ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే ఇది ఖచ్చితంగా చాలా ఉత్సుకతను పెంచింది. ఈ తరహా కథను చాలా తక్కువ రన్ టైమ్‌తో నవ్వించే విధంగా చెప్పాలి. మేకర్స్ బహుశా దీన్ని దృష్టిలో ఉంచుకుని, కేవలం 2 గంటల 2 నిమిషాల రన్ టైమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించారు.

ప్రధానంగా యూత్‌కి చేరువవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా మెప్పించే అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవికా సతీషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. తెలుగురాష్ట్రాల్లో 350 ధియేటర్స్ లో, యూఎస్ లో 100 ధియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Exit mobile version