Tollywood: వన్ మీడియా ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా తెరకెక్కిన చిత్రం “బెస్ట్ కపుల్” సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీ నవంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలకి చంటి, ఇమ్మానుయెల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తున్నారు, అదే కోవలో మా బెస్ట్ కపుల్ సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత పార్థు రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. భార్య భర్తల మధ్య జరిగే సంభాషణలు, గొడవలు, ప్రేమాభిమానాలు ఇలా అన్ని ఈ సినిమాలో ఉన్నాయని కంప్లీట్ ఫ్యామిటీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ప్రేక్షుకల ముందుకు రానుందని డైరెక్టర్ గణేష్ దోరాల తెలిపారు.
ఇదీ చదవండి: దివికేగిన ధృవతార.. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి