Site icon Prime9

Balakrishna: తన డైరక్షన్ లో కొడుకును పరిచయం చేయబోతున్న బాలయ్య

Balakrishna

Balakrishna

Tollywood: నందమూరి బాలకృష్ణ తన చిత్రం ఆదిత్య 369కి సీక్వెల్ చేయాలని నిర్ణయించారు. ఈ సీక్వెల్‌కు ఆదిత్య 999 అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా అంచనాలు ఉన్నాయి. ధమ్కీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా బాలకృష్ణ ఆదిత్య 999కి దర్శకత్వం వహిస్తానని, ఈ చిత్రం వచ్చే ఏడాది థియేట్రికల్‌గా విడుదలవుతుందని తెలిపారు.

బాలయ్య నటన, డైరెక్షన్‌ని బ్యాలెన్స్‌ చేయడం పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ పూర్తిగా దర్శకత్వం పై దృష్టి పెట్టారు. అతను తన కుమారుడు మోక్షజ్ఞను ప్రధాన పాత్రలో పరిచయం చేయాలని భావిస్తున్నారు. బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో నటిస్తారు. మోక్షజ్ఞ తొలి చిత్రం పై చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ, వాటిలో ఏదీ ఖరారు కాలేదు. ఆదిత్య 999 సరైన ప్రాజెక్ట్ అని భావించిన బాలయ్య తన కొడుకును తన దర్శకత్వంలో పరిచయం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. బాలయ్య ప్రస్తుతం 2023 సంక్రాంతికి విడుదల చేసేందుకు ఉద్దేశించిన వీరసింహారెడ్డి షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. తరువాత అనిల్ రావిపూడి యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

Exit mobile version