Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ నెల 20న ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మూడు రోజుల తరువాత శుక్రవారం తల్లి, బిడ్డ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు రామ్ చరణ్ వీరిని తన ఇంటికి తీసుకు వెళ్లారు.
అభిమానుల ప్రార్థనలు ఎప్పటికీ మరువలేము..( Ram Charan)
ఈ సందర్బంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ మీడియాకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు. ఉపాసన బాగా కోలుకుంది, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. డాక్టర్లు, సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలు. మేము చాలా అదృష్టవంతులం. ఎటువంటి సమస్యలు లేకుండా ఇద్దరూ చాలా బాగా ఉన్నారు. అభిమానుల ప్రార్థనలు ఎప్పటికీ మరువలేము. అన్ని దేశాల నుండి మాకు లభించిన ఆశీర్వాదాలకు చాలా ధన్యవాదాలని చెప్పారు. పాప పేరు ఏమిటని అడగ్గా నేను పేరు ఖరారు చేయలేదు. సంప్రదాయం ప్రకారం 21వ తేదీన పేరు ఖరారు చేస్తాం. అప్పుడే పేరు పెడతాం. దీని కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని అన్నారు. రామ్ చరణ్‌ని పాప తనలా లేదా ఉపాసనలా ఉందా అని అడిగినపుడు తనలాగే కనిపిస్తోందని చెప్పి నవ్వారు.