Site icon Prime9

Anand Devarakonda Baby Teaser: ఆకట్టుకుంటున్న ‘బేబీ’ కొత్త పోస్టర్

anand Devarakonda baby movie

Anand Devarakonda: హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి చిత్రం కావడం సినిమాకు ప్లస్. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

సోమవారం చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారు. తాజాగా టీజర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రోజ్ ఫ్లవర్ పెటల్స్ లో హీరోయిన్ వైష్ణవి వివిధ భావోద్వేగాలతో ఉన్నట్లు డిజైన్ చేశారు. ఈ పోస్టర్ డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతీ పోస్టర్ క్రియేటివ్ గా ఉండి సినిమా టీజర్ పై అంచనాలు పెంచాయి. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version