Site icon Prime9

Prabhas: సొంతూరిలో ప్రభాస్.. రెబల్ స్టార్ అభిమానులతో సందడిగా మారిన మొగల్తూరు

prabas in moglturu village

prabas in moglturu village

Prabhas: మొగల్తూరుకు రెబల్ స్టార్ అభిమానులు భారీగా చేరుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన సొంతూరు అయిన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి కృష్ణం రాజు సంస్మరణ సభ ప్రారంభమయ్యింది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 12 ఏళ్ల తర్వాత హీరో ప్రభాస్ అక్కడికి వచ్చారు. చాలా సంత్సరాల తర్వాత ప్రభాస్ సొంతూరికి రావడంతో ఆ ప్రాంతమంతా డార్లింగ్ ఫ్యాన్స్ తో సందడిగా మారింది.

పెద్ద సంఖ్యలో ప్రభాస్ ఇంటికి చేరుకున్న అభిమానులు రెబల్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. ప్రభాస్ ఫొటోలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని రెబల్ స్టార్ డార్లింగ్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇకపోతే వారం రోజుల పాటు ప్రభాస్ మొగల్తూరులోనే ఉండనున్నట్టు సమాచారం. అయితే కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం లక్ష మంది అభిమానులకు అక్కడ భోజన ఏర్పాట్లు చేశారు.
చివరగా 2010లో తండ్రి సూర్యనారాయణ రాజు మరణించిన సమయంలో ప్రభాస్ మొగల్తూరుకు వెళ్లారు.

ఇదీ చదవండి: మహేశ్ బాబు ఇంట్లో చోరీకి విఫలయత్నం..!

Exit mobile version